నేడు యంత్రసేవా పథకం మెగా మేళా

వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గుంటూరు నగరం లోని చుట్టుగుంట సర్కిల్ లో జరిగే కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.

రూ.361.29 కోట్ల వ్యయంతో 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను  పంపిణీ చేయడంతో పాటు రూ.125.48 కోట్ల సబ్సిడీని రైతు సంఘాల ఖాతాల్లో సీఎం నేరుగా జమ చేయనున్నారు.

ఇప్పటికే మొదటి మెగా మేళాలో రూ.240.67 కోట్ల సబ్సిడీతో రూ.690.87 కోట్ల విలువైన 6,525 ఆర్బీకే స్థాయి, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తున్న 3,800 ట్రాక్టర్లు, 391 కంబైన్ హార్వెస్టర్లు, 22,580 ఇతర వ్యవసాయ పనిముట్లు అందించారు.

అన్నదతల సాగు అవసరాలను తీర్చి, యాంత్రీకరణ ద్వారా సాగు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలనే సమున్నత లక్ష్యంతో.. రైతన్నలు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు కడితే చాలు, 40 శాతం సబ్సిడీ, 50 శాతం రుణంతో వారికి యాంత్రీకరణ అందుబాటులోకి తీసుకువచ్చి తద్వారా ఆర్బీకే ప్రాంతంలో ఉన్న మిగిలిన రైతులకు తక్కువ ధరకే యంత్రసేవ అందుబాటులోకి తీసుకురావాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి ఆర్బీకే పరిధిలోకి విస్తరిస్తూ…‘వైఎస్సార్ యంత్రసేవ’పథకానికి రూపకల్పన చేసినట్టు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.

నేడు పంపిణీ చేస్తున్న రూ.361.29 కోట్ల వ్యవసాయ పనిముట్లతో కలిపి ఇప్పటి వరకు 10,444 ఆర్బీకే స్థాయి, 491 క్లస్టర్ స్ధాయి యంత్రసేవా కేంద్రాలకు విస్తరిస్తూ రూ.1052.16 కోట్ల విలువైన 6,362 ట్రాక్టర్లు, 491 కంబైన్ హార్వెస్టర్లు, 36,153 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసి.. రూ.366.15 కోట్లను సబ్సిడీగా అందించి అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

మళ్లీ మరోసారి ఈ అక్టోబరు నెలలో రైతులకు వ్యక్తిగతంగా 7 లక్షలకు పైగా వ్యవసాయ పనిముట్లు, స్ప్రేయర్లు, టార్పాలిన్లు అందించనున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *