Sunday, January 19, 2025
HomeTrending Newsగుత్తా, కడియంలకు మరోసారి ఛాన్స్

గుత్తా, కడియంలకు మరోసారి ఛాన్స్

శాసనమండలి సభ్యుల పేర్లపై శనివారం సుదీర్ఘంగా చర్చించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్ రావు ఆశావహుల లిస్టు సిద్దం చేసినట్టు సమాచారం. ఏడుగురికి అవకాశం ఉండగా ముగ్గురి పేర్లు కెసిఆర్ ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరికి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి శాసన మండలి మాజీ సభాపతి గుత్త సుఖేందర్ రెడ్డి లకు మరోసారి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. వీరిద్దరితోపాటు  పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ లోని మహబూబాబాద్ కు చెందినా తక్కళ్ళపల్లి రవీందర్ రావు నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మిగతా వారి పేర్లు సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్