Friday, May 31, 2024
Homeసినిమా‘105 మినిట్స్’ గొప్ప విజయం సాధించాలి : హన్సిక

‘105 మినిట్స్’ గొప్ప విజయం సాధించాలి : హన్సిక

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మోత్వాని కథానాయిక. సామ్ సి.యస్ సంగీతం అందించగా  కిషోర్  బొయిదాపు సినిమాటోగ్రఫీ అందించారు.  నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో హీరోయిన్ హన్సిక మోత్వాని తో పాటు చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

రాజు దుస్సా మాట్లాడుతూ.. “మేము అనుకున్న కాన్సెప్ట్ ను ఉన్నది వున్నట్లుగా చాలా చక్కాగా తీశాము. రవి గారు నాకు అన్ని విభాగాల్లో వుంటూ నాకు చాలా సపోర్ట్ చేశారు. రవి గారికి చాలా థాంక్స్. హన్సిక గారి గురించి చెప్పాలంటే.. తాను డే వన్ నుండి షూటింగ్ అయిపోయే వరకు తను చాలా  కష్టపడింది. ప్రతి షార్ట్ ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు ఉన్నాకూడా నో అనకుండా చేసింది. మేము సింగల్ షార్ట్ లో చేస్తే హన్సిక గారు ప్రతి షార్ట్ సింగల్ టేక్ లో చేశారు. అలా చేసినందుకే సినిమా తొందరగా పూర్తి చేశాం” అన్నారు.

హీరోయిన్ హన్సిక మోత్వాని మాట్లాడుతూ… నా ప్రతి సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తూ  ప్రోత్సహిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కెరీర్ లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలలోకి  ఈ సినిమా చాలా టఫ్ గా అనిపించింది. దర్శకుడు నాకు ఏం చెప్పాడో అదే ఉన్నది ఉన్నట్లు చాలా చక్కగా తీశాడు. నిర్మాతలు మంచి కథను సెలెక్ట్ చేసుకొని ప్రయోగాత్మకంగా తీశారు. డి.ఓ.పి కిశోర్, రవి నేను ఇరవై నిమిషాల రెయిన్ షాట్ ఉన్నాకూడా వారు నాతో ఉండి అద్భుతంగా చేశారు. టీం అంతా చాలా కష్టపడి పని చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించి దర్శక,నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా” అన్నారు.

చిత్ర నిర్మాత బొమ్మక్ శివ మాట్లాడుతూ… మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్న  మేము  ఇంత తొందరగా సినిమా షూట్ పూర్తి చేస్తాం అనుకోలేదు. చిత్ర యూనిట్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. దర్శకుడు చాలా చక్కగా తీశాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “105 మినిట్స్” చిత్రం ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్