Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ,  హీరో తేజల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం హనుమాన్. ఈ మూవీ టీజర్ ని ఈ నెల 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే గత 15వ తేదీన సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూయడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. ఇప్పుడు మేకర్స్ టీజర్ రిలీజ్ కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హను- మాన్  టీజర్ నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:33 గంటలకు విడుదల కానుంది. హను-మాన్ ఆయుధాన్ని చూపిస్తూ ఓ  అద్భుతమైన పోస్టర్ ద్వారా మేకర్స్  టీజర్ డేట్ ని అనౌన్స్ చేశారు.

పోస్టర్ లో తేజ సజ్జ చేయి కొండ పైన గదను ఎత్తడం కనిపిస్తోంది. అతని చేతికి  బ్రాస్‌లెట్‌, రాగి కంకణం , వేలికి రెండు ఉంగరాలు కూడా ధరించాడు. పోస్టర్ టీజర్‌ పై క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరిలో ఆసక్తి ఏర్పడింది. ప్రశాంత్ వర్మ రెగ్యులర్ చిత్రాలు కాకుండా డిఫరెంట్ మూవీస్ తెరకెక్కిస్తాడనే టాక్ ఉంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండి విజయం సాధిస్తుంది అంటున్నారు సినీజనాలు. మరి.. హనుమాన్ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com