Saturday, June 13, 2026
Homeసినిమాహ్యాప్తీ బర్త్‌డే టీజర్‌ విడుదల

హ్యాప్తీ బర్త్‌డే టీజర్‌ విడుదల

Tripathi HBD: ‘మత్తువదలరా’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హ్యాప్తీ బర్త్‌డే’. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రా న్నిక్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్‌ ఆగస్త్య, సత్య,వెన్నెల కిషోర్‌,గుండు సుదర్శన్‌, తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది.

ఫ‌స్ట్ నుంచి ఈ చిత్రం ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటుది. ఈ చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. వినూత్నంగా, పూర్తి కామెడీ ప్రధానంగా వున్న ఈ టీజర్‌ అందరిని ఇంప్రెస్‌ చేసింది. యూనియన్‌ మినిష్టర్‌ రోల్‌గా వెన్నెల కిషోర్‌ సంభాషణలు, గన్‌బిల్లును ఆమోదించడం, ఇంటికొక గన్‌ పాలసీని ప్రతిపాదించడం, లావణ్య త్రిపాఠి పోల్‌ డ్యాన్స్‌ , సత్య స్టయిలిష్‌ వాక్‌, వంటి సన్నివేశాలు టీజర్‌లో ఎంతో వినోదాత్మకంగా కనిపించి చిత్రం పై అంచనాలు పెంచాయి.

కాలభైరవ తన నేపథ్య సంగీతం, సురేష్‌ సారంగం కెమెరాపనితనం టీజర్‌ను మరింత ఆసక్తిగా కనిపించేలా చేశాయి. ఇది జస్ట్‌ టీజర్‌ మాత్రమే పూర్తి పార్టీ జూలై 15న అనే విధంగా అందరిలోనూ క్యూరియాసిటి పెరిగింది.

Also Read :  జూలై 15న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular