Sunday, June 14, 2026
Homeసినిమాబాలకృష్ణ, గోపీచంద్ మలినేని #NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని #NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్

What a look: నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌ రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ హంట్ విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. “NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్” అని బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్ హంట్ ని ప్రకటించింది. బాలకృష్ణ పుట్టిన రోజు కానుక గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎన్‌బికె107కి సంగీతం అందిస్తున్నారు.

రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

Also Read : బాల‌య్య మూవీలో క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజయ్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular