Saturday, January 18, 2025
Homeసినిమాసోనూసూద్.. మీరు బాగుండాలి : హర్భజన్

సోనూసూద్.. మీరు బాగుండాలి : హర్భజన్

కరోనా సమయంలో కష్టం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా తాజాగా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్.

ఫస్ట్ వేవ్ సమయంలో వలస కార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజెక్షన్.. ఇలా ప్రతీ విషయంలో సాయం చేసి నయా మెస్సయ్యగా మారిపోయారు.

ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెమిడిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనూసూద్‌ను అడగాలంటూ ఫాలోవర్స్ ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్.. తప్పకుండా సహాయం అందుతుందంటూ భరోసా ఇచ్చేశాడు. కర్ణాటకలో అవసరమైన వ్యక్తులకు ఇంజెక్షన్ అందుతుంది అని చెప్పగా.. హర్బజన్ ధన్యవాదాలు సోదరా.. దేవుడు ఆశీస్సులతో మీరు బాగుండాలి అని ఆశీర్వదించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్