Tuesday, June 16, 2026
HomeసినిమాHarihara Veeramallu: రెండు పార్టులుగా 'వీరమల్లు'

Harihara Veeramallu: రెండు పార్టులుగా ‘వీరమల్లు’

పవన్ కళ్యాణ్ – క్రిష్  కాంబినేషన్  లో  మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.  దీని తర్వాత మొదలైన పవన్ నటించిన మూడు సినిమాలు విడుదలైనా  ఇది మాత్రం ఎప్పుడు  వస్తుందో క్లారిటీ లేదు. తాజాగా వీరమల్లు రెండు పార్టులుగా రానుందని ప్రచారం జరుగుతుంది. అసలు ఇది నిజమా కాదా  అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.

వీరమల్లు సినిమాతో పాటు కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఏ.ఎం. రత్నం వీరమల్లు సినిమా గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. ఈ ఇయర్ ఎండింగ్ కి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని.. వచ్చే ఎన్నికల కంటే ముందుగానే హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ కానుందని తెలియచేశారు. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అంతే కాకుండా వీరమల్లు రెండు పార్టులు గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయాలనుకుంటున్నామని తెలియచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular