25.7 C
New York
Thursday, October 5, 2023

Buy now

HomeసినిమాVote Movie: దర్శకేంద్రుడి చేతుల మీదుగా ‘సిరిమల్లె పువ్వా’ సాంగ్

Vote Movie: దర్శకేంద్రుడి చేతుల మీదుగా ‘సిరిమల్లె పువ్వా’ సాంగ్

హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఓటు’… ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తన్వీ నేగి హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఓటు’ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రంలోని ‘సిరిమల్లె పువ్వా’ పాటని లాంచ్ చేశారు. ఈ పాట కోసం ‘పదహారేళ్ళ వయసు’ లోని ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ మెలోడిని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు.

ఒరిజినల్ పాటలోని మాధుర్యాన్ని మరింతగా పెంచుతూ చాలా అద్భుతంగా ఈ పాటని రీమిక్స్ చేశారు సిద్ధార్థ్. సింగర్ సునీత ఆలపించిన ఈ పాటలో వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ఎస్ రాజశేఖర్ డీవోపీ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ ఎడిటర్. మోహన్ తాళ్లూరి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్