Friday, March 13, 2026
HomeTrending Newsప్రజలను మభ్యపెట్టేందుకే బిజెపి పాదయాత్ర - హరీష్

ప్రజలను మభ్యపెట్టేందుకే బిజెపి పాదయాత్ర – హరీష్

Bjp Padayatra : అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి సిగ్గు లేకుండా పాద యాత్ర లు చేస్తారా అని ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు బిజెపి నేతలను ప్రశ్నించారు. ఎందుకోసం పాదయాత్ర?,  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల రిజర్వేషన్ లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా… వడ్లు కొననందుకా?.. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నందుకా?.. వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా?.. నిరుద్యోగుల కు జాబ్ లు ఇవ్వనందుకా?.. ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా…? ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో..చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.  ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలని మంత్రి హరీష్ అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో EGS, CSR నిధులు రూ. 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రంను ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రారంభించారు.

ఎందుకో చెప్పకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారని బిజెపి నేతలు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను హరీష్ రావు హెచ్చరించారు. ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెరాస అన్న మంత్రి హరిశ రావు బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసిఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతామన్నారు. పెంచేటోడు బిజెపి వాడైతే…పంచే వారు తెరాస పార్టీ అన్నారు. ఎవ్వరూ కావాలో…ప్రజలే తెల్చు కావాలని కోరారు. ఈ అంశాలపై గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు విస్తృతంగా చర్చించాలన్నారు. సమైక్య రాష్ట్రంలో ఏకాలం చూసిన ఎండా కాలమే…. స్వరాష్ట్రoలో ఏకాలo చూసిన వానాకాలం లాగే ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి హరీష్ రావు వివిధ అంశాలపై సవాల్ విసిరారు.

మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వంను కిషన్ రెడ్డి నిలదీయాలి. తెలంగాణకు EGS క్రింద EGS కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడం పై కేంద్రాన్ని ప్రశ్నించాలి. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్లకు పెంచేలా చూడాలి.

Also Read తెలంగాణ స్త్రీనిధి దేశానికి ఆదర్శం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular