Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Stri Nidhi Telangana :

గతంలో మహిళలకు డబ్బులు అవసరం ఉంటే భర్తలను బతిమిలాడుకునే పరిస్థితి ఉండేది. ఇప్పడు భర్తలు భార్యలను బతిమిలాడుకునే పరిస్థితి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇందులో స్త్రీనిధి, సీఎం కెసిఆర్ ల పాత్ర ఎంతో ఉంది. మహిళలకు డబ్బులు ఇస్తే ఎక్కడికీ పోదు. మహిళలు అప్పులు ఉంటే నిద్ర పోరు. ఎంత కష్టమైనా అప్పులు కడతారు. పొదుపు చేస్తారు. వాళ్ళు బతికి, నలుగురిని బతికిస్తారని మంత్రి దయాకర్ రావు చెప్పారు.

స్త్రీనిధి 9వ సర్వసభ్య సమావేశాన్ని హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ని ఆడిటోరియం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెప్మా ఎండీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల క‌మిష‌న‌ర్‌ సత్యనారాయణ, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, అధ్యక్షురాలు జి. ఇందిర, ఉపాధ్యక్షురాలు పి. రాఘవ దేవి, కోశాధికారి సరస్వతి, 19 మంది స్త్రినిధి డైరెక్టర్లు, 600 మంది మండల, పట్టణ సమాఖ్యల అధ్యక్షులు, వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్త్రీ నిధి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 50 కోట్ల చెక్కును అందజేశారు. మండల, పట్టణ సమఖ్యాలకు 47 కోట్ల చెక్కును అందజేశారు. స్త్రీ నిధి వార్షిక నివేదికను మంత్రి ఆవిష్కరించారు. చెల్లింపు పద్ధతిని మరింత సులభం, వేగవంతం చేయడానికి వీలుగా online పద్ధతిని మంత్రి ప్రారంభించారు. స్త్రీనిధి డిజిటల్ పద్ధతిని మంత్రి వీక్షించారు. ఈ సేవలను మంత్రి పరిశీలించి, దేశంలోనే తొలిసారిగా స్త్రీ నిధి సంస్థ వినియోగిస్తున్న ఈ సైన్ సేవలను ప్రారంభించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ 32 కోట్లతో ప్రారంభమై, 10 ఏళ్లలో 5,300 కోట్లకు సంస్థను చేర్చిన మా అక్కా చెల్లెళ్ళు అందరినీ అభినందిస్తున్నాను. స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు 3 ల‌క్షల 97 వేల‌ మహిళ సంఘాలలోని 26 ల‌క్షల 92 వేల మంది సభ్యులకు14 వేల 339 కోట్ల రూపాయ‌ల‌ను ఋణాలుగా ఇచ్చాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3 వేల‌ కోట్ల రూపాయ‌ల‌ను రుణాలుగా ఇచ్చాం. ఇంతగా రుణాలను బ్యాంకులు కూడా ఇవ్వలేక పోతున్నాయి. అంత ఘనత సాధించిన స్త్రీ నిధి సంస్థను అభినందిస్తున్నానని మంత్రి అన్నారు.

తెలంగాణ రాక ముందు 2014 మార్చి వ‌ర‌కు కేవ‌లం 742 కోట్లు మాత్రమే ఇస్తే, తెలంగాణ వ‌చ్చాక 14 వేల 339 కోట్లు ఇచ్చాం. అంటే గ‌తంతో పోలిస్తే, 13 వేల 596 కోట్లు అద‌నం. ఇదంతా ప్రభుత్వ సహకారం తోనే సాధ్యమైంది. సీఎం కెసిఆర్ చేసిన కృషి ఎంతో ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. అప్పులివ్వాలంటే బ్యాంకు ల వాళ్ళు షూరిటీ అడుగుతారు. కానీ డ్వాక్రా మహిళలకు ఎలాంటి షూరిటీ లేకుండానే అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. కేవలం మహిళలను చూసి బ్యాంకులు ఇస్తున్నాయని మంత్రి తెలిపారు.

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి, పేదరిక నిర్మూలనా సంస్థ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్నారు. వడ్డీలేని ఋణాలు, రైతు బంధు, మహిళా బంధు వంటి అనేక కార్యక్రమాలు సీఎం కెసిఆర్ అమలు చేస్తున్నారు. మహిళలకు ఎక్కడా లేనంత గౌరవం దక్కుతుంది. మన రాష్ట్రంలో ఇతర బ్యాంకుల తో పాటు, స్త్రీ నిధి బ్యాంకు కూడా ఉంది. ఆర్థిక ప్రగతికి స్త్రీ నిధి ఎంతో ఉపయోగపడుతుంది. 12 వేల కోట్ల రుణాలు బ్యాంక్ లింకేజ్, 3 వేల కోట్లు స్త్రీ నిధి ద్వారా, కలిపితే, 15 వేల కోట్ల రుణాలు రాష్ట్రంలో మహిళలు పొందుతున్నారు. ప్రతిసారీ ప్రభుత్వమే సాయం అందించాలని ఆలోచించవద్దు. స్వయంగా ఎదగడానికి ప్రయత్నించాలి. బ్యాంకర్స్ మహిళలకు రుణాలు ఎక్కువ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. రికవరీ యే ఇందుకు కారణం. ఒక ఏడాదిలో 70 వేల యూనిట్లు గ్రౌండ్ చేయగలిగాం. మహిళలు ఎంతో ఉత్సాహంగా, క్రమశిక్షణ తో పని చేస్తున్నారు. త్వరలోనే సంస్థలో ఉద్యోగుల కొరతను తీరుస్తా0. ప్రభుత్వ సహకారం ఎంతో ఉంది. దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన బ్యాంక్ స్త్రీ నిధి. ఇంత గొప్ప సంస్థలో మనం భాగస్వాములం అయినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్త్రీ నిధికి మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మంచి ఫలితాలు సాధించాలని కోరుతున్నాను.

మెప్మా ఎండీ సత్యనారాయణ మాట్లాడుతూ, 10 ఏళ్లలో సంస్థ విజయవంతమైన గొప్ప ప్రయాణం చేసింది. మన సంస్థ పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలనకు నడుం బిగించాలి. కేవలం 11 శాతం కు మాత్రమే రుణాలు ఇస్తున్నాం. డిపాజిట్లకు కూడా మిగతా బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తున్నాం. సీఎం గారు పట్టణ ప్రగతి ని ప్రారంభించిన సమయంలో స్ట్రీట్ వెండర్స్ ను ఆదుకోవాలని చెప్పారు. 2021 ఏడాదికి ఉత్తమ సంస్థగా స్త్రీ నిధి అవార్డు తీసుకోబోతున్నది. ఈ ప్రయాణాన్ని ఇంకా గొప్పగా సాగించాలని కోరుతున్నాను.

స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ, స్త్రీనిధి సంస్థ ప్రారంభించి 10 ఏళ్లు అవుతున్నది. 48 గంటల్లోనే రుణాలు అందజేస్తున్నాం. కొత్త నైపుణ్యాలు ఇవ్వాళ మొదలయ్యాయి. కానీ స్త్రీ నిధి 10 ఏళ్ల క్రితమే మొదలు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మన స్త్రీనిధి ను అభినందించింది.ఇతర రాష్ట్రాల్లో కూడా మనలాంటి సంస్థలు అమలు చేయాలని సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో మొదలయ్యాయి. ఇంకా మహిళల భాగస్వామ్యం అవసరం. 32 కోట్లతో మొదలై, 5,300 కోట్ల రుణాలు ఇచ్చాం. బ్యాంకు ల కంటే ముందున్న0. అత్యంత స్వల్ప వడ్డీ వసూలు చేసే సంస్థ. దేశంలోనే లేదు. లాభాపేక్ష లేకుండా, సేవే లక్ష్యంగా పని చేస్తున్నాం. డివిడెండ్ లు క్రమం తప్పకుండా ఇస్తున్నాం. 3 వేల కోట్ల రుణాలు ఇచ్చి, నిర్ణీత లక్ష్యాన్ని సాధించాం.

స్త్రీ నిధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన పలువురు ఉద్యోగులను, అధికారులను, సిబ్బందిని వివిధ కేట‌గిరీల వారీగా అవార్డులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్కరించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com