Gabbar Cambo: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను ఫెబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1.. ఈ రెంటిలో ఏదో ఒక తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒకట్రెండు రోజుల షూటింగ్ బాలెన్సు ఉంది, పవన్ ప్రస్తుతం ఈ షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.
అయితే, పవన్ కళ్యాన్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిన్త్రానికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా మొదలైంది. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్-హరీష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ‘మైత్రి’ నిర్మాతలలో ఒకరైన యెర్నేని రవితో కలిసి హరీష్ పవన్ ను భీమలా నాయక షూటింగ్ లొకేషన్ లో కలుసుకుని కాసేపు ముచ్చటించారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ లో తెలియజేస్తూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ‘మా మధ్య అనేక అంశాలపై చర్చ జరిగింది, త్వరలో మా ప్రాజెక్టు షూటింగ్ మొదలవుతోంది’ అంటూ వెల్లడించారు.