Sunday, January 19, 2025
Homeసినిమాబాలయ్యతో హరీష్ శంకర్?

బాలయ్యతో హరీష్ శంకర్?

నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తో 100 సినిమాలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఎవరైనా వంద సినిమాలు పూర్తి చేసిన తర్వాత స్పీడు తగ్గిస్తారు కానీ.. బాలయ్య మాత్రం మరింత స్పీడు పెంచారు. ప్రస్తుతం వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో  బాలయ్య సినిమా ఉంటుంది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురానున్నారు.  దీని తర్వాత   పరశురామ్ బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నారు. అలాగే కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా బాలయ్య సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాడు. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ ప్రకటిస్తారని సమాచారం.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. పవర్ స్టార్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఇంతకీ.. ఎవరా పవర్ స్టార్ డైరెక్టర అంటే.. హరీష్ శంకర్. అవును.. పవన్ తో హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయాలి కానీ.. ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు అందుకనే వేరే హీరోతో మూవీ చేసే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేశారట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. మరి.. ఈ ప్రాజెక్ట్ అయినా అనుకున్నట్టుగా సెట్స్ పైకి వస్తుందో లేదో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్