Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  హర్యానా, యూపీ విజయం

ప్రొ కబడ్డీ:  హర్యానా, యూపీ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో ఢిల్లీపై హర్యానా; బెంగాల్ పై యూపీ విజయం సాధించాయి.

హర్యానా స్టీలర్స్ – దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో  హర్యానా 36-33 తో గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 19-11తో హర్యానా పైచేయి సాధించింది. రెండో అర్ధభాగంలో ఢిల్లీ పుంజుకొని 22-17తో ముందంజలో నిలిచినా ఓటమి తప్పలేదు. మూడు పాయింట్ల తేడాతో హర్యానా విజయం దక్కించుకుంది. హర్యానా కెప్టెన్ వికాస్ ఖండాలా 13 పాయింట్లు సాధించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.

యూపీ యోధ – బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 40-36 తో యూపీ విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 19-18 తో స్వల్ప ఆధిక్యం ప్రదర్శించిన యూపీ రెండో భాగంలోనూ 21-18 తో పైచేయి సాధించింది. మ్యాచ్ ముగిసే సమయానికి నాలుగు పాయింట్ల తేడాతో గెలిచింది. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 19 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత దబాంగ్ ఢిల్లీ (43 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (40); పాట్నా పైరేట్స్ (40); యూపీ యోధ (38); బెంగాల్ వారియర్స్ (36); హర్యానా స్టీలర్స్ (34) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్