Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  హర్యానా, బెంగుళూరు గెలుపు

ప్రొ కబడ్డీ:  హర్యానా, బెంగుళూరు గెలుపు

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో యూపీపై హర్యానా; తెలుగు టైటాన్స్ పై బెంగుళూరు జట్లు విజయం సాధించాయి.

హర్యానా స్టీలర్స్- యూపీ యోధ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 36-35 తో హర్యానా విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 15-14 తో హర్యానా స్వల్ప ఆధిక్యం సాధించింది. కానీ రెండో అర్ధభాగంలో ఇరు జట్లూ హోరాహోరీ ఆడి 21-21తో స్కోరు సమం చేసుకున్నారు. దీనితో మొదటి అర్ధభాగంలో సాధించిన ఒక పాయింట్ ఆదిక్యంతోనే హర్యానా గెలుపు సొంతం చేసుకుంది.

బెంగుళూరు బుల్స్ – తెలుగు టైటాన్స్  జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 36-31తో  బెంగుళూరు విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో బెంగుళూరు 22-11తో భారీ ఆధిక్యం సంపాదించింది. రెండోభాగంలో టైటాన్స్ సత్తా చాటి గట్టి పోటీ ఇచ్చి 20-14తో ముందంజలో నిలిచినా ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిసే సమయానికి ఐదు పాయింట్ల తేడాతో బెంగుళూరు విజయం దక్కించుకుంది. బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ ఈ మ్యాచ్ లో కూడా 12 పాయింట్లతో సత్తా చాటాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… బెంగుళూరు బుల్స్ (46 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (43); పాట్నా పైరేట్స్ (40); యూపీ యోధ (39); హర్యానా స్టీలర్స్ (39); యూ ముంబా (36) జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్