Heavy Explosives On The Bangla Tripura Border :
బంగ్లాదేశ్ లో భారిగా పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. హబిగంజ్ జిల్లాలో బంగ్లాదేశ్ పోలీసులు ఈ రోజు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 15 రాకెట్ ప్రోపెల్లెడ్ గ్రెనేడ్లు, 550 రౌండ్ల మిషిన్ గన్ బుల్లెట్లు, రాకెట్ లాంచర్లకు వాడే 25 బూస్టర్లు పోలీసులు గుర్తించారు. హబిగంజ్ లోని సత్చారి జాతీయ పార్క్ లో వీటిని ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గుర్తించారు. అంతకు ముందు ఢాకాలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండగా ఆ ప్రాంతం త్రిపుర రాష్ట్రానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు దేనికోసం సేకరించారనే అంశం తెలియరాలేదు. దీనిపై బంగ్లాదేశ్ పోలీసు, కౌంటర్ టెర్రరిజం విభాగం విచారణ జరుపుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఇది వెలుగు చూడగానే భారత నిఘా వర్ఘాలు అప్రమత్తం అయ్యాయి. బంగ్లా సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేసి, అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read : బంగ్లాదేశ్ లో ఓడ ప్రమాదం, 32 మంది మృతి