Bangladesh Tourist Ship Ferry Fires  

దక్షిణ బంగ్లాదేశ్‌లో పర్యాటకులతో ఫుల్ గా ఉన్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఈ రోజు కనీసం 32 మంది మరణించారు.  రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ గ్రామీణ పట్టణం ఝలోకతి సమీపంలో సుఘంధ నదిలో ఈ ఘటన తెల్లవారుజామున జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో దాదాపు 500 మంది ఉన్నారు. మూడు అంతస్తుల ఓభిజాన్ 10 షిప్ నది మధ్యలోకి ఉండగా మంటలు వచ్చాయని, మృతుల సంఖ్య పెరగవచ్చని, చాలా మంది అగ్నిప్రమాదంలో చనిపోగా మరికొంత మంది నదిలోకి దూకి మునిగిపోయారని స్థానిక పోలీసులు దుర్ఘటన వివరాల్ని వెల్లడించారు.

ఢాకా నుంచి ఇంటికి తిరిగివస్తున్న వారితో నిండిన ఫెర్రీలో మంటలు ఇంజన్ గదిలో ఉద్భవించాయని బావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సుమారు 100 మందిని కాలిన గాయాలతో ఆసుపత్రులకు పంపారు. పద్మ, జమున నదుల డెల్టా, సముద్ర సంగమ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 170 మిలియన్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ లో పేలవమైన విధుల నిర్వహణ, షిప్‌యార్డ్‌ల వద్ద దిగజారిన భద్రతా ప్రమాణాలు, కిక్కిరిసిన రద్దీ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది  జూలైలో ఢాకా వెలుపలి పారిశ్రామిక పట్టణమైన రూపగంజ్‌లోని ఆహార,పానీయాల ఫ్యాక్టరీలో జరిగిన మంటల్లో 52 మంది చనిపోయారు. రసాయనాలను అక్రమంగా నిల్వ ఉంచిన ఢాకా అపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగడంతో ఫిబ్రవరి 2019లో కనీసం 70 మంది మరణించారు.

ఆగస్ట్‌లో తూర్పు బంగ్లాదేశ్‌లోని సరస్సులో ప్రయాణికులతో నిండిన పడవ, ఇసుకతో నిండిన కార్గో షిప్ ఢీకొనడంతో కనీసం 21 మంది మరణించారు. బిజోయ్‌నగర్ పట్టణానికి సమీపంలో కార్గో షిప్ యొక్క స్టీల్ బోటు మరో ఓడను ఢీకొన్నప్పుడు పడవలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కార్గో షిప్ స్టీల్ టిప్ మరియు పడవ ఢీకొనడంతో ప్రయాణీకుల ఓడ బోల్తా పడిన తర్వాత గజ ఈతగాళ్ళు మురికి నీళ్లలో మరిన్ని మృతదేహాలను శోధించాల్సి వచ్చింది. గత ఏడాది జూన్‌లో, ఢాకాలో ఒక ఫెర్రీని వెనుక నుండి మరొక ఫెర్రీ ఢీకొనడంతో కనీసం 32 మంది మరణించారు. ఫిబ్రవరి 2015లో రద్దీగా ఉన్న ఓడ కార్గో నౌకను ఢీకొనడంతో కనీసం 78 మంది మరణించారు.

Also Read : లుధియానా పేలుళ్ళ వెనుక ఖలిస్తాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *