Friday, June 12, 2026
HomeTrending Newsమూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక

మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక

భాగ్యనగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ(Musi)కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద మూసీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బాపూ ఘాట్, శంకర్ నగర్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ(GHMC) హెచ్చరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular