Saturday, January 18, 2025
Homeసినిమామహేష్‌ మూవీలో అక్కినేని హీరో.?

మహేష్‌ మూవీలో అక్కినేని హీరో.?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని ఇటీవల ఎనౌన్స్ చేశారు. మే 31న ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ఈ మూవీ గురించి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయా..? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. త్రివిక్రమ్ కు తన సినిమాల్లో యంగ్ హీరోలకు ఛాన్స్ ఇస్తుంటారు.

ఆది పినిశెట్టి, నవీన్ చంద్ర, సుశాంత్.. తదితర యంగ్ హీరోలకు తన సినిమాల్లో ఓ డిఫరెంట్ రోల్ ఇచ్చారు. ఇప్పుడు మహేష్ తో చేయనున్న సినిమాలో కూడా ఓ స్పెషల్ రోల్ ఉందట. ఆ రోల్ ను తివిక్రమ్ అక్కినేని ఫ్యామిలీ హీరోతో చేయించాలి అనుకుంటున్నారని తెలిసింది.

ఇంతకీ.. ఎవరా అక్కినేని ఫ్యామిలీ హీరో అంటారా..? సుమంత్ అని సమాచారం. మహేష్‌ బాబు – సుమంత్ ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే.. అటు మహేష్ అభిమానులు ఇటు సుమంత్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తారు.

అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్