Saturday, January 18, 2025
Homeసినిమా'బెదురులంక'లో కొత్త కార్తికేయ కనిపిస్తాడు: హీరో కార్తికేయ 

‘బెదురులంక’లో కొత్త కార్తికేయ కనిపిస్తాడు: హీరో కార్తికేయ 

టాలీవుడ్ లో కాస్త ఒడ్డూ పొడుగూ ఉన్న హీరోల్లో కార్తికేయ ఒకరు. ‘RX 100’ సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆ సినిమా స్థాయిలో ఆ తరువాత హిట్ పడలేదు. అప్పటి నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. తొందరపడి కథలను ఒప్పేసుకుంటున్నట్టుగా అనిపించి ఈ మధ్య కాస్త గ్యాప్ కూడా తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన సినిమానే ‘బెదురులంక 2012’. యుగాంతం జరుగనుందనే ప్రచారంతో ‘బెదురులంక’ ప్రజలు ఎలా స్పందించారు? ఏం చేశారు? అనే కథాంశంతో నడిచే సినిమా ఇది.

ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.; ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ స్టేజ్ పై కార్తికేయ మాట్లాడుతూ .. ఇకపై కథ వినగానే ఓకే చేయవద్దని అనుకున్నాననీ, బాగా కసరత్తు చేసిన తరువాతనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నానని అన్నాడు. అయితే ‘క్లాక్స్’ ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశాననీ, అంతగా ఈ కథపై తనకి నమ్మకం కలిగిందని చెప్పాడు. ఇంతవరకూ చూడని ఒక కార్తికేయను క్లాక్స్ చూపించాడని అన్నాడు.

ముందుగా ఈ సినిమా కోసం వేరే హీరోయిన్ ను అనుకున్నామనీ, ఆ తరువాత అనుకోకుండా నేహా శెట్టి జాయిన్ అయిందని చెప్పాడు. ‘డీజే టిల్లు’లో ఆమె చేసిన రాధిక పాత్రను ఆడియన్స్ ఇప్పటికీ మరిచిపోలేదనీ, ఈ సినిమాలో ఆమె చేసిన ‘చిత్ర’ పాత్ర కూడా ఆ స్థాయిలోనే కనెక్టు అవుతుందని అన్నాడు. ఇక ఎల్బీ శ్రీరామ్ – అజయ్ ఘోష్ పాత్రలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారనీ, ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకి ఉందని చెప్పాడు.  ఇక నేహా శెట్టి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన మేకర్స్ కి థ్యాంక్స్ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్