Sunday, March 15, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవీరారాధన ఒక జబ్బు

వీరారాధన ఒక జబ్బు

This is also Pandemic: ఒక క్రికెటర్, సినిమా హీరో, రాజకీయ నాయకుడిని అభిమానించడం సాధారణంగా జరిగేదే. ఇది అనేక సమాజాల్లో అనేక సమయాల్లో కనిపిస్తుంది . నిజానికి ఇది ఒక మాస్ సైకాలజీ అంశం. తాను నిజజీవితంలో చేయలేనిది తన హీరో {ముఖ్యంగా సినిమా హీరో} వెండి తెరపై చేసి చూపిస్తే,  అది తనకు వర్తింప చేసుకొని ఒక రకమైన బ్రాంతి,  అందులోనించి వచ్చే అనుభూతిని ఎంజాయ్ చేయడం.

ఉదాహరణకు రిక్షా నడిపే వ్యక్తి  శ్రమను గౌరవించాలి. ఆ వృత్తిలోని గొప్పదనాన్ని సమాజం అర్థం చేసుకోవాలి. కానీ మన సమాజంలో ఆలా జరగలేదు.  అలాంటి ప్రయత్నాలు కూడా పెద్దగా   జరగలేదు. రిక్షా నడిపే వ్యక్తిని సమాజం చిన్న చూపు చూస్తుంది. తమిళ హీరో ఎంజిఆర్ 1971 లో రిక్షా కారన్ సినిమా తీశారు. అందులో రిక్షా నడిపే వ్యక్తిని,  గొప్పింటి,  అందమైన అమ్మాయి ప్రేమిస్తుంది. నిజజీవితం లో అసాధ్యమయిన పనులు ఆ హీరో అందులో చేస్తాడు. దీన్ని  చూసి ఆనాటి రిక్షా కార్మికులు ఎంతో మంది మానసిక అనుభూతిని పొందారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.

తొండ ముదిరితే ..?
హీరోను అభిమానించడం సాధారణం. కానీ …
ఒక వ్యక్తిని .. ఆ వ్యక్తి రాజకీయ నాయకుడు కావొచ్చు . సినిమా హీరో కావొచ్చు .. లేదా ఇంకేదైనా రంగానికికి చెందిన సెలబ్రిటీ కావొచ్చు.

ఆ వ్యక్తిని …

1 . అమితంగా అభిమానించడం, తన కంటే తన భార్య / భర్త , తల్లి , తండ్రి , కొడుకు కూతురు కంటే ఎక్కువ ఇష్టపడడం .
2 . రోజులో ఎక్కువ గంటలు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ, పోస్ట్ చేస్తూ, వాదిస్తూ గడపడం.  తన వృత్తి కంటే ఎక్కువ సమయం తన హీరో గురించి ఆలోచిస్తూ వాదిస్తూ గడపడం
3 . ఆ వ్యక్తి గురించి ఎవరైనా సహేతుకంగా విమర్శించినా సహించలేకపోవడం. అలాంటి వారిని ద్వేషించడం.
4 . ఆ  వ్యక్తిలో లోపాలున్నా దాన్ని గ్రహించలేకపోవడం . గ్రహించినా దాన్ని సమర్థించడం.
5 . ఆ వ్యక్తి దేవుడి ప్రత్యేక సృష్టి అని నమ్మడం .. ఆరాధించడం .. ఆ వ్యక్తి ఆరాధనే తన జీవితంగా చేసుకొని బతకడం.

చదువంటే పట్టాలు మార్కు లు కాదు. చదువంటే సామజిక, భావోద్వేగ తెలివితేటలు  నేర్పేది. అది కొరవడిన నాడు సమాజంలో భావ దారిద్య్రం వస్తుంది. ఇదో రకమైన సమస్య. ఆ ఖాళీ ను హీరో వర్షిప్ సిండ్రోమ్ భర్తీ చేసే అవకాశముంది .

ఒక వ్యక్తి తన జీవితంలో అనుకున్నదాని సాధించలేక పోయినా,  తీరని కోరికలు ఉన్నా హీరో వర్షిప్ సిండ్రోమ్ కు గురయ్యే అవకాశముంది.

సోషల్ మీడియా ద్వారా హీరో వర్షిప్ ఒక అంటువ్యాధి  అయ్యి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.  ఒక పాండెమిక్ గా మారుతుంది. ఒకరి వల్ల,  మరొకరి లో ఈ సిండ్రోమ్ తీవ్రత పెరుగుతుంది.

కోట్లమంది ఈ మానసిక వ్యాధి బారిన పడినా సమాజం,  మానసిక శాస్త్రవేత్తలు,  మేధావులు గుర్తించలేనంతగా ఇది వ్యాపిస్తుంది.  ఇది  సహజం, సాధారణం అనుకొనేంతగా పరిస్థితి మారిపోతుంది .

-వాసిరెడ్డి అమరనాథ్

Also Read :

ఎవరి సంస్కారం ఏపాటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular