ఆస్ట్రేలియా సుప్రీమ్ కోర్ట్ లో మొదటిసారిగా ఓ భారతీయుడు ఉన్నత పదవి చేపట్టబోతున్నాడు. భారతీయ మూలాలు ఉన్న హమేంట్ దంజి న్యూ సౌత్ వేల్స్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆస్ట్రేలియన్ భారతీయుడైన దంజి 1990 లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. మూడు దశాబ్దాలుగా లీగల్ ప్రాక్టీస్ చేస్తున్న దంజి క్రిమినల్ ప్రాక్టిసు లో దిట్టగా పేరు సంపాదించారు.
హమేంట్ దంజి న్యాయమూర్తి పదవి చేపట్టడంపై ఆస్ట్రేలియా మంత్రి, న్యూ సౌత్ వేల్స్ అటార్నీ జనరల్ మార్క్ స్పీక్మన్ హర్షం వ్యక్తం చేశారు. దంజీకి భారత్ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దంజి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు న్యాయ విద్య సిడ్నీలో పూర్తి చేశారు.