Sunday, June 14, 2026
HomeTrending Newsసిఎం జగన్ తో హిమాచల్ డిజిపి భేటి

సిఎం జగన్ తో హిమాచల్ డిజిపి భేటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్ లో బస చేసిన జగన్ ను ఆ రాష్ట్ర డిజిపి సంజయ్ కుమార్ కుండు, సిమ్లా ఎస్పీ డా. మోనికా మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సిఎం జగన్ కు హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ కుల్లు టోపీని, షాల్ ను కప్పి సన్మానించారు. ఓ జ్ఞాపిక తో పాటు చంబా దశావతారాలతో కూడిన వెండి ప్రతిమను కూడా సిఎం జగన్ కు వారు బహూకరించారు.

జగన్, భారతిల పెళ్లి జరిగి ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి 25 సంవత్సరాలు.. ఈ సందర్భంలో కుటుంబంతో కలిసి ఐదురోజులపాటు గడిపేందుకు  జగన్ సిమ్లా వెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular