మల్లారెడ్డి విద్యా సంస్థలపై విచారణకు డిమాండ్

మంత్రివర్గం లో సచ్చిలుడు ఉంటారు అంటున్నారు, మల్లారెడ్డి యూనివర్సిటీ భూములు ఎలా వచ్చాయో చెప్పాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జవహర్ నగర్ లో 488 సర్వే నేం..5 ఎకరాల భూమి ఉండగా, ఇది రిజిస్ట్రేషన్ లకు   నిషేధిత సర్వే నంబర్ అని వివరించారు. ఐదెకరాల ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డు పెడితే ఇదే భూమిలో సీఎంఆర్ ఆసుపత్రులు వచ్చాయని ప్రశ్నించారు. ఇది మల్లారెడ్డి కోడలు శాలిని రెడ్డీ పేరుతో ఉందని, జవహర్ నగర్ లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమి లో రిజిస్ట్రేషన్ నిషేధించిన తర్వాత భూమి ఎలా బదిలీ అయ్యిందన్నారు. గజ దొంగలను పక్కన పెట్టుకుని… కేటీఆర్ నీతులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

గుండ్ల పోచంపల్లిలో సర్వే నెం. 650 లో భూమి 22 ఎకరాలున్నది 33 ఎకరాలు అయ్యిందో వివరాలు కెసిఆర్ కి పంపిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. 2004 లో గ్రామపoచాయతీ అనుమతితో లే అవుట్లు భూమి అమ్మేశారని, Ghmc అయ్యాక..మళ్లీ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.

ఫీజు రీ ఎంబర్స్ మెంట్… లో వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని విజిలెన్సు నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక బయట పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి విద్యా సంస్థలు… ఫోర్జరీ సర్టిఫికెట్ లు పెట్టిన దొంగ మల్లారెడ్డి అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *