అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ పగ్గాలు చేపట్టబోతున్నారు. బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో బిశ్వ శర్మ పేరును ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బనంద్ సోనోవాల్ ప్రతిపాదించగా, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రంజీత్ కుమార్, బలపరిచారు. ఈ విషయాన్ని బిజెపి పరిశీలకుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
అంతకుముందు సోనోవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. రాజ్ భవన్లో గవర్నర్ జగదీష్ ముఖి కి సమర్పించారు. తదుపరి ముఖ్యమంత్రి వచ్చే వరకూ కొనసాగాల్సిందిగా గవర్నర్ సోనోవాల్ ను కోరారు.
ఇటివల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 126 స్థానాలకు గని బిజెపి నేతృత్వంలోని ఎన్డియే కూటమి 75 సీట్లు గెల్చికుంది. బిజెపి సొంతంగా 60 స్థానాల్లో విజయం సాధించింది. మిత్ర పక్షాలైన అస్సాం గణ పరిషత్ 9 సీట్లు, యుపిపిఎల్ 6 సీట్లు గెల్చుకున్నాయి.
శర్బానంద సోనోవాల్ గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే ఈసారి ముఖ్యమంత్రి తనకే ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చిన హిమంత బిశ్వ ఎట్టకేలకు తన పంతం నెరవేర్చుకున్నారు.