Saturday, June 6, 2026
Homeసినిమాబాలయ్య జోడీగా మరోసారి సందడి చేయనున్న హనీ రోజ్? 

బాలయ్య జోడీగా మరోసారి సందడి చేయనున్న హనీ రోజ్? 

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి‘ సినిమాలో ఆయన పాత్రను డిజైన్ చేరేసిన తీరు బాగా హైలైట్ అయింది. ఆ తరువాత వరుసలో దునియా విజయ్ – వరలక్ష్మి శరత్ కుమార్ కనిపిస్తారు. ఒక చెల్లెలు అన్నయ్యను అపార్థం చేసుకుని, నేరుగా వెళ్లి విలన్ తో తాళి కట్టించుకోవడమనేది ఈ సినిమాలో కొత్త పాయింట్. ఈ ఇద్దరూ కూడా బాలయ్యతో తలపడే సన్నివేశాలను  రక్తి కట్టించారు. ఇందులో హీరోయిన్ శ్రుతి హాసన్ అయినప్పటికీ, హానీ రోజ్ పాత్ర ఎక్కువమందికి కనెక్ట్ అయింది.

సీనియర్ బాలయ్యకి భార్యగా భార్యగా గ్లామరస్ గాను, యంగ్ బాలయ్యకి తల్లిగా నడివయసు పాత్రలోను  హనీరోజ్ మెప్పించింది. గ్లామర్ కి తోడు ఆమె నటన కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎక్కువమందిని ఆకర్షించిన నటిగా నిలిచింది. ఇక మొన్నటికి మొన్న జరిగిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ లోను హనీరోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గులాబీ రంగు మేనిఛాయలో .. వైలెట్ కలర్ డ్రెస్ లో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.

స్టేజ్ పై ఆమె ఏవో నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడి వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె చక్కగా తెలుగులో మాట్లాడుతూ మరింత ఆకట్టుకుంది. బాలయ్య నెక్స్ట్ మూవీలోను ఆమె ఛాన్స్ కొట్టేసిందనే టాక్ ఇప్పుడు చక్కెర్లు  కొడుతోంది. తన తదుపరి సినిమా అనిల్ రావిపూడితో ఉంటుందని అదే స్టేజ్ పై బాలయ్య చెప్పారు. ఈ సినిమాలోనే హానీరోజ్ కూడా కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular