Saturday, July 27, 2024
Homeసినిమాఆకట్టుకుంటున్న ‘కార్పొరేటర్’ ట్రైలర్  

ఆకట్టుకుంటున్న ‘కార్పొరేటర్’ ట్రైలర్  

సమీప మూవీస్ – యు & ఐ స్టూడియోస్ బ్యానర్లపై హాస్య నటుడు షకలక శంకర్ , సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరో, హీరోయిన్లుగా సంజయ్ పూనూరి దర్శకత్వంలో ఎ.పద్మనాభిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కార్పొరేటర్’. షూటింగ్ పూర్తి చెసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ‘కార్పోరేటర్’ ట్రైలర్ ను విడుదల చేశారు.

హీరో షకలక శంకర్ మాట్లాడుతూ.. మేము విడుదల చేసిన ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో నా యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చాలా మంది ఫోన్స్ చేసి ప్రశంసిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా ట్రైలర్ ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు. చిత్ర దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో షకలక శంకర్ , హీరోయిన్లు చాలా బాగా నటించారు. వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుంది. ఇందులోని పాటలు, ఫైట్స్ సందర్భానుసారంగా వస్తాయి. ఈ సినిమాలో 5 పాటలు, 4 ఫైట్స్ ఉంటాయి. మా యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

షకలక శంకర్,  సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత : డాక్టర్ యస్.వి. మాధురి, కెమెరా : జగదీష్ కొమరి; సంగీతం : ఎం.ఎల్.పి.రాజా, ఎడిటర్ : శివ శర్వాణి, ఫైట్ మాస్టర్ : విన్చున్ అంజి, పి.ఆర్.ఓ :మధు వి.ఆర్, నిర్మాత : ఎ. పద్మనాభిరెడ్డి, దర్శకుడు : సంజయ్ పూనూరి

RELATED ARTICLES

Most Popular

న్యూస్