Tuesday, April 16, 2024
Homeసినిమాఆగ‌స్ట్ 23న హీరో నితిన్ ‘మాస్ట్రో’ ట్రైల‌ర్‌

ఆగ‌స్ట్ 23న హీరో నితిన్ ‘మాస్ట్రో’ ట్రైల‌ర్‌

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’.  బ్లాక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్ గా న‌టిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగ‌స్ట్ 23, సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్.. నితిన్‌, న‌భా న‌టేశ్‌, త‌మ‌న్నా భాటియా ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, పాట‌లు సినిమా పై జ‌బ్ క్రియేట్ చేశాయి. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే నిర్మాత‌లు ప్ర‌క‌టించ‌నున్నారు. నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్