Friday, March 29, 2024
HomeTrending Newsఅక్టోబర్ ౩౦న హుజురాబాద్ సమరం

అక్టోబర్ ౩౦న హుజురాబాద్ సమరం

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30న జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్  విడుదల చేసింది. నవంబర్ 2 న ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

అక్టోబర్ 1 న నోటిఫికేషన్ విడుదల కానుంది, నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8

అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13.

అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు,  ఫలితాల ప్రకటన.

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.  అధికార టిఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేస్తుండగా, బిజెపి తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేడో రేపో అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్