Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హైదరాబాద్ గెలిచింది

హైదరాబాద్ గెలిచింది

SRH won: హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ గెలిచింది. ఆరంభంలో రెండు ఓటములు.. ఆ తర్వాత ఐదు విజయాలు, మళ్ళీ ఐదు పరాజయాలతో నిరాశపరిచిన విలియమ్సన్ సేన ఎట్టకేలకు మరో విజయం చవి చూసించింది. ముంబై ఇండియన్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 3 పరుగులతో విజయం సాధించింది. హైదరాబాద్ విసిరిన 194 పరుగుల లక్ష్య సాధనలో ముంబై పోరాడి ఓడిపోయింది  ఒక దశలో ముంబై బ్యాట్స్ మ్యాన్  టిమ్ డేవిడ్ కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి ముంబైని విజయ్ తీరాల దాకా తీసుకెళ్ళాడు. అయితే 18వ ఓవర్ చివరి బంతికి డేవిడ్ రనౌట్ గా వెనుదిరగడంతో హైదరాబాద్ విజయం ఖాయమైంది. భువనేశ్వర్ కుమార్ 19 వ ఓవర్ మేడిన్ వికెట్ తీసుకున్నాడు. చివరి ఓవర్లో కూడా ముంబై ఆటగాడు రమన్ దీప్ సింగ్ 14 పరుగులు చేసి తుదికంటూ పోరాటం చేశాడు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, జట్టు స్కోరు 18 వద్ద హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(9) ఔటయ్యాడు. మరో ఓపెనర్ ప్రియం గార్గ్- రాహుల్ త్రిపాఠి కలిసి రెండో వికెట్ కు 78 పరుగులు జోడించారు. 26  బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి గార్గ్ వెనుదిరిగాడు. త్రిపాఠి-పూరన్ మూడో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పూరన్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38, త్రిపాఠి 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఔటయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.  ముంబై బౌలర్లలో  రమన్ దీప్ సింగ్ మూడు; డానియెల్ శామ్స్, మెరెడిత్, బుమ్రా తలా ఒక వికెట్ పడగొట్టారు.

ముంబై తొలి వికెట్ కు 95 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 36 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 48; ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 1  సిక్సర్ తో 43 పరుగులు చేసి మంచి శుభారంభం ఇచ్చారు. డానియల్ శామ్స్-; తిలక్ వర్మ-8, స్టబ్బ్స్ -2 పరుగులే చేసి ఔటయ్యారు. సంజయ్ యాదవ్ డకౌట్ అయ్యాడు. రమన్ దీప్-14;  బుమ్రా-0 పరుగులతో క్రీజులో నిలిచారు. 20 ఓవర్లలో ముంబై 7 వికెట్లకు 190 పరుగులు చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు; భువీ, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ పడగొట్టారు.

రాహుల్ త్రిపాఠికి ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : రేసులో నిలిచిన ఢిల్లీ: పంజాబ్ పై గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్