Saturday, January 18, 2025
HomeTrending Newsప్రజల పక్షమే ఉంటాను - తమిళి సై

ప్రజల పక్షమే ఉంటాను – తమిళి సై

తనను ఆపే శక్తి ఎవరికీ  లేదని గవర్నర్  తమిళి సై  అన్నారు. మహిళా దర్బార్ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మహిళా దర్భార్ ను ఈ రోజు హైదరాబాద్ రాజ్ భవన్ లో నిర్వహించారు. సుమారు గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంలో  సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళా దర్బార్ కు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలని, గవర్నర్ ప్రజలను కలవ గలరా అని ప్రశ్నిస్తున్నారని గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ కార్యాలయం అయిన ప్రజల కోసమే ఉందని, కరోనా టైమ్ లో నన్ను బయటకు వెళ్ళోద్దని నా సెక్యూరిటీ వారించిన నేను వెళ్లి పరామర్శించానని గుర్తు చేశారు. తెలంగాణ మహిళలకు అండగా,తోడుగా ఉండాలని అనుకుంటున్నానని, మహిళకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని అనుకుంటున్నానని గవర్నర్ వెల్లడించారు.

మహిళా దర్బార్ కు ఎదురు చెబుతున్న వారిని నేను పట్టించుకోనని గవర్నర్ తేల్చి చెప్పారు. నిరసన తెలిపే వారి గురించి ఆందోళన చెందను. తెలంగాణ ప్రజల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుందని, ప్రజల పక్షాన ఒక బలమైన శక్తిగా ఎప్పుడు ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. నన్ను ఎవరూ అడ్డుకోలేరని, మహిళా సమస్యలను బలంగా స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. విధానం ఏదైనా ప్రజల కోసమే.. మహిళల గొంతుకలు వినిపించాలని, నేను ఉత్ప్రేరకం మాత్రమే..మనమే గెలుస్తాం… ఎవరు అపపలేరని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు.

Also Read : ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తమిళిసై అసంతృప్తి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్