Saturday, November 23, 2024
HomeTrending NewsYS Jagan: డిసెంబర్ లోగా విశాఖకు షిఫ్ట్

YS Jagan: డిసెంబర్ లోగా విశాఖకు షిఫ్ట్

డిసెంబర్ లోగా విశాఖకు మకాం మారుస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రకటించారు. పరిపాలనా విభాగం అంతా వస్తుందని, పాలన ఇక్కడినుంచే సాగుతుందని స్పష్టం చేశారు. దసరా పండుగ నాటికే ఇక్కడకు రావాలని అనుకున్నా అధికారుల కార్యాలయాలు, వసతి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఇంకా కొంత సమయం కావాల్సి ఉండడంతో లేటు అయ్యిందని వివరించారు. నేడు విశాఖలో పర్యటించిన సిఎం మొదటగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్నిప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం ఈ విషయం వెల్లడించారు,.

హైదరాబాద్,చెన్నై, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందని, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. ఏటా 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోందని పేర్కొన్నారు.

నేటి సిఎం ప్రకటనతో  సిఎం షిఫ్తింగ్ మరోసారి వాయిదా పడింది.  గత మంత్రివర్గ సమావేశంలో దసరా నాటికి విశాఖ వెళుతున్నట్లు  మంత్రులతో సిఎం జగన్ చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా  మొదలు పెట్టారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కాకపోవడం, సిఎంవోతో పాటు పలు కీలక శాఖల అధికారులకు కూడా అక్కడ బస ఏర్పాట్లు కల్పించాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈ పనులన్నీ పూర్తి కావడానికి సమయం కావాల్సి రావడంతో సిఎం షిఫ్తింగ్ కూడా మారినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్