Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్అక్టోబర్ 17 నుంచి టి-20 వరల్డ్ కప్

అక్టోబర్ 17 నుంచి టి-20 వరల్డ్ కప్

టి-20 వరల్డ్ కప్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియాలో జరగాల్సిన ఈ టోర్నీ కోవిడ్ కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మారిన సంగతి తెలిసిందే. యూఏఈ  తో పాటు ఒమన్ లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

తొలుత 2020 జులైలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఈ టోర్నీ కోవిడ్ మొదటి దశ కారణంగా వాయిదా పడింది. 2021 లో ఇండియాలో ఈ ఈవెంట్ జరుగుతుందని ఐసిసి ప్రకటించింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల మొదటి నుంచి కోవిడ్ రెండో దశ దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ దశలో ఇండియాలో ఈ టోర్నీ నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితుల్లో దుబాయి కి వేదిక మార్చారు. అయితే అక్కడ మ్యాచ్ లు జరిగినా హోస్ట్ గా బిసిసిఐ వ్యవహరించనుంది.  దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షేక్ జాయెద్ స్టేడియమ-అబుదాబి, షార్జా, ఒమన్ క్రికెట్ అకాడెమి గ్రౌండ్ లో ఆ మ్యాచ్ లు జరగనున్నాయి.

మనదేశం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో యూఏఈ, ఒమన్ లో ఈ టోర్నీనిర్వహిస్తున్నామని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. హోస్ట్ గా ఈ టోర్నీని విజయవంతం చేస్తామని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.  కాగా, కోవిడ్ కారణంగా మధ్యలో నిలిచిపోయిన 14వ సీజన్ ఐపిఎల్-2021 సెప్టెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనే మొదలు కానుంది. అక్టోబర్ 15న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్