Thursday, November 21, 2024
Homeస్పోర్ట్స్డ్రా అయితే సంయుక్త విజేతలు

డ్రా అయితే సంయుక్త విజేతలు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా గా ముగిసినా లేదా టై అయినా  రెండు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసిసి స్పష్టం చేసింది. జూన్ 18 నుంచి 22 వరకూ సౌతంప్టన్ లో  ఈ మ్యాచ్ జరగనుంది. జూన్ 23ను రిజర్వ్ డే గా ఉంచారు. ఐదు రోజుల మ్యాచ్ లో ఏరోజైనా పూర్తి సమయం ఆడలేకపోయినా, వెలుతురు కారణంగా ముందుగానే మ్యాచ్ ఆపేయాల్సి వచ్చినా ఆ రోజుల్లో కోల్పోయిన సమయాన్ని పూడ్చడానికే రిజర్వ్ డే ఉంది తప్ప మ్యాచ్ పలితం తేల్చడానికి కాదని ఐసిసి శుక్రవారం వివరించింది.

రిజర్వ్ డే విషయమై తగు సమాచారాన్ని మ్యాచ్ రిఫరీ ఎప్పటికప్పుడు రెండు జట్ల కెప్టెన్ల తోనూ, మీడియాతోనూ పంచుకుంటారని ఐసిసి తెలియజేసింది. ఈ మ్యాచ్ ను గ్రేడ్ 1 డ్యూక్స్ బంతితో ఆడతారని పేర్కొంది.

జూన్ మొదటి వారంలో భారత జట్టు ఈ ఫైనల్ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కోసం బయలుదేరుతోంది. ఆటగాళ్ళు అందరికీ కవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసి పంపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్