Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ICC Qualifier Super Six: ఒమన్ పై జింబాబ్వే విజయం

ICC Qualifier Super Six: ఒమన్ పై జింబాబ్వే విజయం

ఐసిసి వరల్డ్ కప్ -2023 క్వాలిఫైర్స్ సూపర్ సిక్స్ దశ తొలి మ్యాచ్ లో ఒమన్ పై జింబాబ్వే 14 పరుగులతో విజయం సాధించింది. సీన్ విలియమ్స్ మరోసారి రాణించి 103 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసి జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. 333 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ చివరి బంతి వరకూ వీరోచిత పోరాటం చేసి ఓటమి పాలైంది.

బులవాయోలోని క్వీన్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒమన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే48 పరుగులకు ఓపెనర్లు ఇద్దరి వికెట్లూ (గుంబీ-21; క్రేగ్ ఎర్విన్-25) కోల్పోయింది. మధేవెరె-23  రన్స్ చేసి వెనుదిరిగాడు. సీన్ విలియమ్స్ మరోసారి రాణించి 103 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 142 పరుగులు చేసి ఆరో వికెట్ గా ఔటయ్యాడు.  సికిందర్ రాజా-42; జాంగ్వే-43 రన్స్ తో సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసింది.

ఒమన్ బౌలర్లలో ఫయ్యజ్ భట్ 4; బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మసూఖ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఒమన్ ఓపెనర్ కాశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ తో 103 పరుగులు చేసి సత్తా చాటగా… అయాన్ ఖాన్-47; అఖిబ్ ఇలియాస్-45; కెప్టెన్ జీషన్ మసూఖ్-37; మహమ్మద్ నదీమ్-30 రన్స్ తో తమ వంతు పోరాటం చేశారు. ఓవర్ల కోటా పూర్తయ్యే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది.

జింబాబ్వే బౌలర్లలో తేడాయ్ ఛతారా, ముజరబ్బానీ చెరో 3; నగరవ 2; సికిందర్ రాజా  ఒక వికెట్ పడగొట్టారు.

సీన్ విలియమ్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

ఈ విజయంతో వరల్డ్ కప్ టాప్ -10 లో బెర్త్ కు జింబాబ్వే మరికాస్త దగ్గరైంది. మిగిలిన రెండు మ్యాచ్ లలో ఒకటి గెలిచినా బెర్త్ ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్