Saturday, July 27, 2024
Homeసినిమాజక్కన్నకు స్థానం దక్కకపోవడానికి కారణం..?

జక్కన్నకు స్థానం దక్కకపోవడానికి కారణం..?

రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ భారీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. జపాన్ లో అప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డులను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు గాను ఎవరూ ఊహించని ఆస్కార్ అవార్డ్ ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు రాజమౌళి. అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కి ఇప్పుడు మరో అరుదైన గౌరవం లభించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ టీమ్ లోని ఆరుగురుకి ఆస్కార్ అవార్డ్ కమిటీలో స్థానం కల్పించింది. ఆ ఆరుగురు ఎవరంటే.. ఎన్టీఆర్, చరణ్‌, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు.

అయితే… ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కించి.. అద్భుత విజయం సాధించి.. ఆస్కార్ అవార్డ్ తో చరిత్ర సృష్టించిన రాజమౌళికి మాత్రం ఈ కమిటీలో స్థానం కల్పించలేదు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అయితే అకాడెమీ ఏ ప్రాతిపదికన ఈ గుర్తింపును ఇస్తుంది? అంటే .. దానికి ఏవో కొన్ని లెక్కలు చెప్పుకొచ్చారు అకాడెమీ ప్రతినిధులు. అకాడెమీ సంస్థలోకి కొత్త సభ్యుల ఎంపిక వృత్తిపరమైన అర్హతలపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. అయితే.. రాజమౌళి -ఎస్.శంకర్ లాంటి లెజెండ్స్ కి అకాడెమీ కొత్త సభ్యత్వాల్లో అసలు ఛాన్స్ లేదు. భారతదేశం నుంచి ఇంకా ఎందరో దిగ్గజ దర్శకులు ఉన్నా కానీ ఎవరి పేరూ ఈ జాబితాలో లేదు. ఒకే ఒక్క మణిరత్నంకి మాత్రమే భారతదేశం నుంచి అవకాశం దక్కింది.

దీనిని బట్టి విశ్లేషిస్తే… రాజమౌళికి ఇంకా సీనియారిటీ రావాలేమో? అనిపిస్తుంది. అయితే.. మణిరత్నం కంటే సీనియారిటీ ఉన్న వాళ్లు చాలా మంది భారతీయ దర్శకులు ఉన్నారు. సీనియారిటీ.. కంటెంట్ సహా అంతర్జాతీయ వేదికల పై గుర్తింపు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకున్నాకే అకాడెమీ సభ్యత్వం దక్కుతుందని భావించాలి. అలా అనుకుంటే.. చరణ్‌, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు ఆర్ఆర్ఆర్ సినిమాతోనే గ్లోబల్ రేంజ్ లో పాపులర్ అయ్యారు. వీరికి ఇవ్వడానికి కారణం ఏంటి..? ఏది ఏమైనా రాజమౌళికి జ్యూరీలో స్థానం ఇవ్వాల్సింది. అయితే.. ఆర్ఆర్ఆర్ టీమ్ లో ఆరుగురుకి స్థానం దక్కడం భారతీయులుగా ముఖ్యంగా తెలుగువారిగా గర్వించదగ్గ విషయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్