ఐసిసి వరల్డ్ కప్ కాలిఫైర్స్ సూపర్ సిక్స్ దశలో నేడు జరిగిన చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై శ్రీలంక 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన నేటి మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 243 పరుగులు చేయగా ఈ లక్ష్యాన్ని 44.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి శ్రీలంక ఛేదించింది. పాథుమ్ నిశాంక మరోసారి సెంచరీ తో రాణించాడు.
విండీస్ జట్టులో కీసీ కార్టీ 87; జేమ్స్ ఛార్లెస్-39 ; రోమనియో షెఫర్డ్-26; కెవిన్ సింక్లైర్-25 పరుగులు చేశారు. 48.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో మహీష తీక్షణ 4; దుషణ్ హేమంత 2; దిల్షాన్ మధుశంక, శనక, మతీశ పతిరణ, సహన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
శ్రీలంక తొలి వికెట్ కు 190 పరుగులు చేసింది. నిశాంక 113 బంతుల్లో 14 ఫోర్లతో 104 రన్స్ చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ కరుణరత్నే83 స్కోరు చేసి వెనుదిరగ్గా, కుశాల్ మెండీస్-34; సమర విక్రమ-17 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
నాలుగు వికెట్లు తీసిన మహీష తీక్షణ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.
శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఇప్పటికే టాప్-10 లో బెర్తులు సంపాదించగా, ఈ రెంటిలో తొలి రెండు స్థానాల కోసం ఎల్లుండి మ్యాచ్ జరగనుంది.