Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఐసిసి పురుషుల FTC విడుదల

ఐసిసి పురుషుల FTC విడుదల

2023-27 సీజన్ కు గాను పురుషుల క్రికెట్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (ఎఫ్.టి.పి.) ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) విడుదల చేసింది. మొత్తం 777 మ్యాచ్ లు జరగనుండగా వీటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 323 టి-20లు ఉన్నాయి. ఐసిసిలో మొత్తం 12దేశాలకు చెందిన జట్లు ఉండడంతో గతంతో పోల్చితే ఈ ఎఫ్.టి.పి.లో మ్యాచ్ ల సంఖ్య 694 నుంచి 777కు పెరిగింది.

ఇక ఇండియా విషయానికి వస్తే,  2023-27 సీజన్ లో 38  టెస్ట్ మ్యాచ్ లు, 42 వన్డేలు, 61 టి-20లు ఆడబోతోంది.  మనదేశంలో 2023  జరగనున్న ప్రపంచ కప్ వన్డే టోర్నమెంట్ కంటే ముందు టీమిండియా 27 వన్డేలు ఆడుతుంది.  గవాస్కర్- బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య రెండు సారి ఐదు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.   2023-27 ఎఫ్.టి.పి.కి సంబంధించి ఇండియా షెడ్యూల్ జూలై 2023లో మొదలు కానుంది. వెస్టిండీస్ తో ఆ దేశంలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టి 20మ్యాచ్ ల సిరీస్  ఆడనుంది.  ఈ ఆగస్ట్ నుంచి నాలుగేళ్ల సీజన్ పూర్తయ్యే నాటికి ఇండియా మొత్తం 44  టెస్ట్ మ్యాచ్ లు, 63వన్డేలు, 76 టి-20లు ఆడబోతోంది.

2023-25; 2023-25 సంవత్సరాలకు గాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లు కూడా ఆడనున్నాయి. వీటితో పాటు 19 రెండు మ్యాచ్ ల సిరీస్ ఇండియా ఆడబోతోంది. ఈ నాలుగేళ్ల సీజన్ లో ఒక ప్రపంచ కప్, ఒక ఛాంపియన్స్ ట్రోపీ తో పాటు రెండేసి చొప్పున టి-20 వరల్డ్ కప్, డబ్ల్యూటిసి టోర్నమెంట్లు జరగనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్