Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఆఫ్ఘన్ పై ఇండియా విజయం

ఆఫ్ఘన్ పై ఇండియా విజయం

టి 20 వరల్డ్ కప్ లో వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన టీమిండియా తొలి విజయం నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తో నేడు జరిగిన పోరులో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహూల్ లు మొదటి ఓవర్ నుంచే చెలరేగి ఆడారు. తొలి వికెట్ కు 140 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.  రోహిత్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు; రాహూల్ 48 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లతో 69 పరుగులు చేసి ఓటయ్యారు. ఆ తర్వాత వచ్చిన రిషభ్ పంత్-27 (13 బంతుల్లో ఒక ఫర్, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా-35 (13బంతులలో 4 ఫోర్లు, 2సిక్సర్లు) కూడా ధాటిగా ఆడి అజేయంగా నిలవడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇండియా ఇన్నింగ్స్ లో మొత్తం 19 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయింది. 13 పరుగుల వద్ద ఓపెనర్లు హజ్రతుల్లా (13);  షాజాద్ (0) ఇద్దరూ ఔటయ్యారు. రహమతుల్లా గుర్బాజ్ (19), గుల్బదిన్ నబి (18) కాస్త నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా పది పరుగుల తేడాతో ఇద్దరూ ఔటయ్యారు. నబీబుల్లా జడ్రాన్ (11) అశ్విన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ మహమ్మద్ నబీ 35 పరుగులు చేసి అవుట్ కాగా, కరీం జనత్ కేవలం 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు  చేసింది. ఇండియా బౌలర్లలో  షమీ మూడు, రవిచంద్ర అశ్విన్ రెండు, బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

రోహిత్ శర్మకు కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్