Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్సెమీస్ లో కివీస్- ఇండియా ఇంటి దారి

సెమీస్ లో కివీస్- ఇండియా ఇంటి దారి

ICC T20 Wc New Zealand Beat Afghanistan By 8 Wickets And Through Into Semi Finals :

టి20 వరల్డ్ కప్ లో ఇండియా సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గెలుపొంది సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అబుదాబీలో నేడు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి, రేపటి మ్యాచ్ లో ఇండియా గెలిస్తే  తమ జట్టు సెమీఫైనల్ చేరవచ్చన్న భారత క్రికెట్ అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.

ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, జట్టులో నజీబుల్లా జడ్రాన్-73 (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ; గుల్బడిన్ నబి-15; మహమ్మద్ నబీ-14 మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. న్యూ జిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు, టిమ్ సౌతీ రెండు, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోది తలా ఒక వికెట్ పడగొట్టారు.

న్యూ జిలాండ్ 26 పరుగుల వద్ద డేల్ల్ (17) రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. 57 పరుగుల వద్ద మరో ఓపెనర్ గుప్తిల్28 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.  ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్-40; డేవాన్ కాన్వే-36 పరుగులతో అజేయంగా నిలిచి 18.1 ఓవర్లలో విజయం చేకూర్చారు.

నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Must Read :స్కాట్లాండ్ పై ఇండియా ఘనవిజయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular