Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్నమీబియాపై న్యూజిలాండ్ విజయం

నమీబియాపై న్యూజిలాండ్ విజయం

ICC T20 Wc New Zealand Beat Namibia By 52 Runs :

ఐసిసి టి-20 వరల్డ్ కప్  నేటి మ్యాచ్ లో నమీబియాపై న్యూజిలాండ్ 52 పరుగులతో విజయం సాధించింది. కివీస్ ఆటగాడు నీషమ్ జేమ్స్ 35 పరుగులతోపాటు ఒక వికెట్ పడగొట్టి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూ జిలాండ్ ఓపెనర్లు గుప్తిల్-18; మిచెల్-19; కెప్టెన్ విలియమ్సన్-28; డెవాన్ కాన్వే-17పరుగులు చేశారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్-39; జేమ్స్ నీషమ్-35 పరుగులతో అజేయంగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

నమీబియా ఓపెనర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ దాన్ని మిగతా ఆటగాళ్ళు కొనసాగించలేకపోయారు. ఇన్నింగ్స్ 8,9,10 వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్-21; మైఖేల్ వాన్ లింగెన్-25; జానే గ్రీన్-23; డేవిడ్ వీస్-16 పరుగులు చేశారు. నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Must Read :స్కాట్లాండ్ పై ఇండియా ఘనవిజయం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్