Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్నమీబియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

నమీబియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం

Icc T20 Wc Afghanistan Beat Namibia By 68 Runs :

ఐసీసీ టి-20 వరల్డ్ కప్ సూపర్12లో నేడు జరిగిన మ్యాచ్ లో నమీబియాపై ఆఫ్ఘనిస్తాన్ 62 పరుగులతో ఘనవిజయం సాధించింది. నమీబియా ఓపెనర్లు ఇద్దరినీ తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపి, మొత్తం మూడు వికెట్లు తీసిన ఆఫ్ఘన్ బౌలర్ నవీల్ ఉల్ హక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

అబుదాబీలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, మహమ్మద్ షాజాద్ తొలి వికెట్ కు 53 పరుగులు చేశారు. హజ్రతుల్లా-33; షాజాద్-45; అస్ఘర్ ఆఫ్ఘన్-31; చివర్లో కెప్టెన్ నబీ 17 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో 32 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్, నికోల్ చెరో రెండు, స్మిత్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా మొదటి ఓవర్లోనే ఓపెనర్ క్రెగ్ విలియమ్స్ (1) వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో మరో ఓపెనర్ మైఖేల్ వాన్ (11) కూడా ఔటయ్యాడు. ఆఫ్హన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా సరైన భాగస్వామ్యం నెలకొల్పలేకపోయింది. డేవిడ్ వీస్ ఒక్కడే 26 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. దీనితో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే నమీబియా చేయగలిగింది. ఆఫ్హన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, హమిద్ హసన్ చెరో మూడు, గుల్బదిన్ నబి రెండు, రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

సూపర్ 12లో ఇప్పటికి మూడు మ్యాచ్ లు ఆడిన ఆఫ్ఘన్ రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో గ్రూప్ 2 లో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Must Read షకీబ్ క్షమాపణ : 4 మ్యాచ్ ల నిషేధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular