Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్షకీబ్ క్షమాపణ : 4 మ్యాచ్ ల నిషేధం

షకీబ్ క్షమాపణ : 4 మ్యాచ్ ల నిషేధం

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించారు. ఢాకా ప్రిమియర్ లీగ్ లో భాగంగా శుక్రవారం మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్- అభాహాని జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న షకీబ్ అవుట్ కోసం అప్పీల్ చేశారు, కానీ అంపైర్ నాటౌట్ అని సంజ్ఞ చేశాడు, ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసహనానికి గురైన షకీబ్ మొదట వికెట్లను బలంగా తన్నాడు, అక్కడితో ఆగకుండా అంపైర్ తో వాగ్వావాదానికి కూడా దిగాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. పలువురు నెటిజెన్లతో పాటు క్రికెట్ విశ్లేషకులు, పండితులు షకీబ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పు బట్టారు. మహమ్మదన్ సపోర్టింగ్ క్లబ్ కు షకీబ్ సారధ్యం కూడా వహిస్తున్నాడు.

ఫీల్డ్ లో వివాదం తర్వాత విరామ సమయంలో అభాహాని టీం కోచ్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ కూడా అయిన ఖలీద్ మహ్మూద్ తో కూడా షకీబ్ వాగ్వాదానికి దిగాడు. షకీబ్ పై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించామని మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ డైరెక్టర్ మసుజ్జుదమాన్ వెల్లడించాడు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు.

అయితే తన ప్రవర్తన పట్ల షకీబ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు, అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రేక్షకులు, ఢాకా లీగ్ ఆడుతున్న జట్లు, మేనేజ్మెంట్, టోర్నీ అధికారులు అందరూ ఈ ఘటనను మానవ తప్పిదంగా భావించి క్షమించాలని కోరాడు. సీనియర్ ఆటగాడిగా ఇలా ప్రవర్తించ కూడదని అంటూ భవిష్యత్తులో ఇలాంటివి జరగబోవని హామీ ఇచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్