Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్సౌతాఫ్రికా అద్భుత విజయం

సౌతాఫ్రికా అద్భుత విజయం

ఐసీసీ టి-20 వరల్డ్ కప్ నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో శ్రీలంకపై సౌతాఫ్రికా అద్భుత విజయం నమోదు చేసింది. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో డేవిడ్ మిల్లర్ రెండు సిక్సులు, రబడ ఒక ఫోర్ తో పాటు చెరో సింగల్ చేసి లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించారు.

షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది, కుశాల్ పెరీరా ఏడు పరుగులే చేసి నార్త్జ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ నిశాంక పోరాటం చేస్తున్నా మిగిలిన బ్యాట్స్ మెన్ నుంచి సరైన సహకారం లభించలేదు. చరిత్ అసలంక 21 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేకపోయారు. నిశాంక 58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. శ్రీలంక 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా బౌలర్లలో టబ్రైజ్, ప్రెటోరియస్ చెరో మూడు వికెట్లు, నార్త్జ్ రెండు వికెట్లు పడగొట్టారు.

సౌతాఫ్రికా కూడా పరుగులు రాబట్టడానికి కష్టపడింది. ఓపెనర్లు డికాక్-12; హెండ్రిక్స్-11 తో పాటు వన్ డౌన్ లో వచ్చిన డసేన్-16; ఎడెన్ మార్ క్రమ్-19 పరుగులు చేసి ఔటయ్యారు. కెప్టెన్ తంబా 46 పరుగులు చేశారు. 18వ ఓవర్లో హసరంగా రెండు వరుస బంతుల్లో కెప్టెన్ తంబా, ప్రిటోరియస్(0) లను ఔట్ చేసి  మ్యాచ్ ను లంకవైపు మలిపాడు. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు కావాల్సిన దశలో డేవిడ్ మిల్లర్, రబడలు ఒత్తిడిని అధిగమించి ఆడి జట్టును విజయంవైపు నడిపించారు. మిల్లర్ 13 బంతుల్లో 2సిక్సర్లతో 23; రబడ 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 13 పరుగులతో అజేయంగా నిలిచారు.

మూడు కీలక వికెట్లు పడగొట్టిన టబ్రైజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్