Friday, April 19, 2024
HomeTrending Newsబద్వేల్ లో తగ్గిన పోలింగ్ శాతం

బద్వేల్ లో తగ్గిన పోలింగ్ శాతం

వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికల్లో ఏడు గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం 68.12 శాతం పోలింగ్ నమోదైంది. తుది లెక్కలు పోల్చి చూసిన తర్వాత కొంత మేరకు పెరిగే అవకాశం ఉంది. అయితే గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఆ స్థాయిలో పోలింగ్ జరిగే పరిస్థితి కనబడడం లేదు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీనుంచి విరమించుకోవడం, కాంగ్రెస్ పై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత తగ్గకపోవడం, బిజెపికి స్థానికంగా పెద్దగా పట్టు లేకపోవడం లాంటి అంశాలతో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉంది, ఇదే భావనతో పట్టణ ప్రాంతాల ప్రజలు ఓటింగ్ లో పాల్గొనడంపై ఆసక్తి చూపలేదు.

నవంబర్ 2 న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్