Varudu Kavalenu Team Thanked The Audience For Making Success Of The Movie :

కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది ‘వరుడు కావలెను’ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించారు. చిత్ర బృందం పాల్గొని తమ సినిమాకు మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

నటి హిమజ మాట్లాడుతూ ‘వరుడు కావలెను’ సూపర్ సక్సెస్ సందర్భంగా టీమ్ అందరికీ కంగ్రాట్స్. సెల్ఫీ సరళ పాత్రలో నేను బాగా నటిస్తాను అని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకురాలు సౌజన్య గారికి థాంక్స్. నాకు ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్ లాంటిది. ఎందుకంటే నేను ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను. సేమ్ క్యారెక్టర్ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. నా క్యారెక్టర్ తో పాటు సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతుండటం సంతోషంగా ఉంది” అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ “వరుడు కావలెనుతో ఒక క్లీన్ మూవీ చేశాం. థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పుకుంటున్నాం. సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. సినిమా బాగుందనే మౌత్ టాక్ తో ప్రతి షో కు థియేటర్ లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. ఒక కొత్త డైరక్టర్ ని తీసుకొచ్చి మా సంస్థకు హిట్ ఇచ్చినందుకు హీరో నాగశౌర్యకు థాంక్స్ చెబుతున్నాను. మా సంస్థలో మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకొస్తాం” అన్నారు.

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ “వరుడు కావలెను సినిమాకు మీరు ఇచ్చిన విజయానికి థాంక్స్. మా మూవీ టీమ్ అంతా ఒక మహిళైన నన్ను నమ్మి సపోర్ట్ చేసి సినిమా చేయించారు. అక్కా అని పిలిచే నాగశౌర్య నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. చినబాబు గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం, సితార లాంటి మంచి సంస్థలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా సక్సెస్ చేసి మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అని అనుకుంటున్నాను. మేము కథలో అనుకున్న భావోద్వేగాలు స్క్రీన్ మీద పండాయి. సకుటుంబంగా సమేతంగా థియేటర్లకు వస్తూ మా చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. అన్ని వయసుల ఆడియెన్స్ హాయిగా చూసే సినిమా అని చెబుతున్నారు. ఇదే కాదు భవిష్యత్ లో నేను చేయబోయే సినిమాలు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా ఉంటాయి” అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ “వరుడు కావలెను తప్పకుండా విజయం సాధిస్తుందని మొదటి నుంచీ బలంగా నమ్మాను. ఇవాళ మా నమ్మకం నిజమైంది, ఈ సినిమా చూసి ఆదరించిన ప్రేక్షకులకు, చూడబోయే ప్రేక్షకులకు కూడా థాంక్స్ చెబుతున్నా. థియేటర్లకు వచ్చిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు సినిమా బాగా నచ్చింది. సినిమా బాగుంది అనే టాక్ పెరుగుతోంది. ఈ చిత్రంతో మీకు ఇంకా దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్లదే కాదు, ఎంతోమంది తెర వెనక పని చేశారు వాళ్లందరికీ విజయంలో భాగముంది. నేను లవర్ బాయ్ ఇమేజ్ కు దూరం. ఎందుకంటే హీరోగా అన్ని రకాల కథలు, పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను”అన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రముఖ కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ చిత్ర బృందం మౌనం పాటించారు.

Must Read : మహిళలు అన్ని విభాగాల్లో రాణించాలి :అల్లు అర్జున్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *