Sunday, March 30, 2025
Homeస్పోర్ట్స్మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై కివీస్ విజయం

మహిళల వరల్డ్ కప్: బంగ్లాపై కివీస్ విజయం

NZ Beat Bangla: ఐసిసి మహిళా వరల్డ్ కప్ టోర్నీలో  నేడు జరిగిన మ్యాచ్ లో  బంగ్లాదేశ్ పై ఆతిథ్య న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్ లో వెస్టిండీస్ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైన కివీస్ నేడు ఏకపక్షంగా గెలుపొందింది.

వర్షం కారణంగా మ్యాచ్ ను 27 ఓవర్లకు కుదించారు.  డునేదిన్ లోని యూనివర్సిటీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా తొలి వికెట్ కు 59 పరుగులు చేసింది. షమీనా సుల్తానా 33 పరుగులు చేసి ఔటయ్యింది, 79 వద్ద కెప్టెన్ నైగర్ సుల్తానా 11 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ ఫర్గానా హక్ 52 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగింది. ఆ తర్వాత శోభన మాస్టరీ ఒక్కటే 13 పరుగులు చేసింది. మిగిలినవారు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కేటాయించిన 27 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. బంగ్లాలో  ముగ్గురు రనౌట్ అయ్యారు, కివీస్ బౌలర్లలో సత్తార్ వైట్ మూడు; జేన్సేన్, మాకీ చెరో వికెట్ పడగొట్టారు.

కివీస్ 36 పరుగుల వద్ద కెప్టెన్ సోఫీ డివైన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సుజీ బేట్స్- అమేలియా కెర్ర్ మరో వికెట్ పడకుండానే లక్ష్యాన్ని సాధించారు. సుజీ-79 (68 బంతుల్లో 8 ఫోర్లు );  అమేలియా -47 (37 బంతులు, 5 ఫోర్లు) పరుగులతో అజేయంగా నిలిచారు.

సుజీ బేట్స్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : మహిళల వరల్డ్ కప్: ఇంగ్లాండ్ పై ఆసీస్ విజయం  

RELATED ARTICLES

Most Popular

న్యూస్