3.5 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeసినిమాఇకపై గ్యాప్ ఉండదు: ప్రభాస్ హామీ

ఇకపై గ్యాప్ ఉండదు: ప్రభాస్ హామీ

No Rest: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంట‌గా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. యు.వి. క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించిన రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు.

ఇంత‌కీ ప్ర‌భాస్ ఏం చెప్పారంటే “అభిమానులూ! మిమ్మ‌ల్ని నా సినిమాల కోసం ఎక్కువగా వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఇక నుంచి నా నుంచి వరుస సినిమాలు రానున్నాయి. నా ఫ్యాన్స్ హ్యాపినెస్ కోసం నేను సంవత్స‌రానికి 300 రోజులు పని చేస్తాను. నాకు ఎంత‌గానో స‌పోర్ట్ అందిస్తున్నందుకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను” అంటూ ప్రభాస్ అన్నారు. అభిమానుల కోసం ప్ర‌భాస్ ఇలా చెప్ప‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నారు. ప్ర‌భాస్ మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్