Friday, March 29, 2024
Homeసినిమాసుశాంత్ కి హ్యాట్రిక్ మూవీ అవుతుంది : త్రివిక్రమ్

సుశాంత్ కి హ్యాట్రిక్ మూవీ అవుతుంది : త్రివిక్రమ్

సుశాంత్, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌వుతుంది.  ఈ సంద‌ర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్య‌క్ర‌మానికి స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి చౌద‌రి, నిర్మాత హ‌రీశ్‌, డైలాగ్ రైట‌ర్ సాయిబాబా, అభిన‌వ్ గోమ‌టం, సినిమాటోగ్రాఫ‌ర్ సుకుమార్‌, పాట‌ల ర‌చ‌యిత శ్రీనివాస్ మౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు, అవసరాల శ్రీనివాస్, వి.ఎన్.ఆదిత్య, జెమినీ కిరణ్, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రోల్ రైడా, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “ఇండియాలోనే కాదు, ప్ర‌పంచం మొత్తం మీద థియేట‌ర్‌కు రావ‌డానికి సాహ‌సిస్తున్న వారు తెలుగు జాతి మాత్ర‌మే… ఏమీ భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు….మంచి కంటెంట్ క్రియేట్ చేసి మ‌రింత ముందుకు వెళ్దాం… ఈ సినిమా చేయ‌బోతున్న‌ట్లు అల వైకుంఠ‌పుర‌ములో షూటింగ్ టైమ్‌లోనే సుశాంత్ చెప్పాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని నేను కూడా బ‌య‌ట వింటున్నాను. సుశాంత్ త‌న‌కు తెలియ‌కుండా ఓ చ‌ట్రంలో ఇరుక్కుపోయాడ‌ని అనుకునేవాడిని. అయితే… నాకు తెలిసి చి.ల‌.సౌ సినిమాతో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఆ సినిమా చూసే త‌న‌ని నా ‘అల వైకుంఠ‌పుర‌ములో’ యాక్ట్ చేయ‌మ‌ని అడిగాను.

ఇప్పుడు త‌న హ్యాట్రిక్ మూవీ ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు. ఈ సినిమాతో ప్రొడ్యూస‌ర్ నుంచి గ‌వ‌ర్న‌మెంట్‌కు బోల్డెంత ట్యాక్స్ క‌ట్టించాలి. డైరెక్ట‌ర్ ద‌ర్శ‌న్‌.. ఫస్ట్ మూవీ ఇది. అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు. ఓ సినిమాను మిక్సింగ్ చేసి వ‌దిలేస్తుంటే.. మ‌నింటి ఆడపిల్ల‌ను ఎవ‌రికో ఇచ్చేసి పంపిచేస్తున్న‌ట్లుగా ఉంటుంది. అందులో ఫ‌స్ట్ మూవీ అనే స‌రికి ఇంకా బాధ‌గా ఉంటుంది. కాకుంటే ఆడపిల్ల వెళ్లి సెప‌రేట్ ఎస్టాబ్లిష్ ఎలా చేస్తుంద‌నే ఆనందంగా పంపిస్తామో, సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని, ప్ర‌జ‌ల జీవితాల్లోకి వెళ్లిపోయి. థియేటర్లో, టీవీల్లో, మొబైల్ ఫోన్లలో, కామెడీ సీన్లలో, పాటల్లో దానికి తాలుకు శ‌బ్దం వినిపిస్తున్న‌ప్పుడు, దాని జీవితం తాలుకు స్పాన్ పెరుగుతున్న‌ప్పుడు మ‌న‌కు మ‌రింత ఆనందంగా, గ‌ర్వంగా, ఉత్సాహంగానూ ఉంటుంది. అలాంటి రోజులు మ‌రిన్ని ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌న్‌కు రావాల‌ని కోరుకుంటున్నాను. ప్రవీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ బాగా న‌చ్చింది. యాక్ట‌ర్ వెంక‌ట్.. ట్రూ హైద‌రాబాదీ. నేను హైద‌రాబాద్ వ‌చ్చిన కొత్త‌ల్లో ఈయ‌న న‌టించిన సీతారాముల క‌ళ్యాణం చూత‌మురారండి సినిమా చూశాను. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్ అభిన‌వ గోమ‌టం, మీనాక్షి చౌద‌రి ఆల్ ది బెస్ట్‌. ప్రియ‌ద‌ర్శిని పెళ్లిచూపుల నుంచి చూస్తున్నాను. సిన్సియ‌ర్ యాక్ట‌ర్‌. ఇలా అంద‌రికీ అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్