Tuesday, June 16, 2026
HomeTrending Newsఓడితే సన్యాసం తీసుకుంటా - ఈటల

ఓడితే సన్యాసం తీసుకుంటా – ఈటల

తెలంగాణ వ్యాప్తంగా హుజూరాబాద్ పై చర్చ జరుగుతోంది. కేసీఆర్ పతనానికి నాంది పలికే గడ్డ. మీకు హామీ ఇస్తున్నా. అందరూ సంఘీభావం చెబుతుండ్రు. కేసీఆర్ నోట్ల కట్టలకు, మద్యం సీసాలకు, అహంకారానికి, కుట్రలకు చరమగీతం పాడే సత్తా హుజూరాబాద్ ప్రజానీకానికి ఉంది. యుద్దం మొదలైంది. నన్ను ఎట్లా ఓడించాలి? ఖతం పట్టియ్యాలి? తెలంగాణను మరో 20 ఏళ్లు బానిసలుగా ఎట్లా చేయాలి? అని పథకాలు వేస్తుండు. ఈ పథకాలకు కుట్ర చేస్తోంది హరీష్ రావు. ఒక్క బక్క పేదోడి మీద, ఉద్యమకారుడి మీద ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తుండ్రో మీరు చూస్తుండ్రు. వాళ్లు వీళ్లు ఎందుకు కేసీఆర్ దమ్ముంటే రా…కొట్లాడదాం.

మీ మాదిరిగా మద్యం, డబ్బు నేను ఇస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను గెలిస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? 2023లో ఇక్కడ ఎగిరే జెండా కాషాయా జెండా. తెలంగాణను బానిసత్వం నుండి బద్దలు కొట్టే సత్తా బీజేపీకే ఉంది. దేశంలో సుస్థిర పాలన, 18 రాష్ట్రాల్లో పాలన చేస్తోంది బీజేపీ. తెలంగాణలో సుసంపన్నమైన పాలన బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడబోతోంది. ఇండియా టుడే సర్వేలో రాష్ట్రానికి కేసీఆర్ కొనసాగడం అరిష్టమని 84 శాతం ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇక్కడ మాత్రం విమర్శిస్తూ….అక్కడికిపోయి వంగివంగి దండాలు పెట్టే పరిస్థితి వచ్చింది. మీరెన్ని తప్పుడు కథనాలు ప్రసారం చేసినా తెలంగాణ గడ్డమీద రాజకీయ పోరాటం చేస్తది. 2023 లో గెలిచేందుకు కేసీఆర్ డబ్బు, కుట్ర మద్యాన్ని, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకున్నడు. దీనికి చెల్లుచీటి పలికే సత్తా తెలంగాణ ప్రజలకుంది. కేసీఆర్ కు బరిగీసి ఓడించే సత్తా బీజేపీకి, తెలంగాణ ప్రజలకు ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular